కార్తీకమాసం రెండో సోమవారం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు ముక్కంటికి అభిషేకాలు, పూజలు చేశారు. పంచారామ క్షేత్రాలైనా పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం, సోమారామం క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి.
తణుకు పరిధిలోని సజ్జాపురంలో సోమేశ్వరస్వామి ఆలయం, కపర్ధీశ్వరాలయం భక్తులతో రద్దీగా మారాయి. ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహిళలు ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉండ్రాజవరంలోని గోకర్ణేశ్వర స్వామి ఆలయంలో భక్తులు స్వామివారికి అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
ఇదీ చదవండి