జనసేనాని పవన్‌కల్యాణ్‌పై జూబ్లీహిల్స్‌లో కేసు ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 22న భీమవరంలో జరిగిన సభలో జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్టేషన్లో కేసు నమోదైంది. ప్రచార సభలో పవన్‌కల్యాణ్ చేసిన ఆరోపణలో వాస్తవం లేదని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నేత కొంతం గోవర్దన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పవన్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయ సలహా తీసుకున్న అనంతరం ఈ కేసులో చర్యలు తీసుకుంటామని జూబ్లీహిల్స్ సీఐ బాలకృష్ణ తెలిపారు.
ఇదీ చదవండి:
'రౌడీలు రాజకీయాలు చేస్తానంటే చూస్తూ కూర్చోం'