పశ్చిమ గోదావరిజిల్లాలోని ఏలూరు నగరంతోపాటు.. భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు, నరసాపురం, జంగారెడ్డిగూడెం, నిడదవోలు పట్టణాల్లో జనం స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూకు మద్దతు పలికారు. గ్రామాల్లో జనం బయటకు రాకుండా స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. జనతా కర్ఫ్యూలో భాగస్వామ్యులయ్యారు. ఏలూరు నగరంలో ప్రధాన కూడళ్లలో నిశ్శబ్ధ వాతావరణం కనిపించింది. ఆర్టీసీ బస్టాండ్, పాత బస్టాండ్, రైల్వేస్టేషన్, ఒకటో పట్టణం, ఆర్ఆర్ పేట ప్రాంతాల్లో రహదారులు బోసిపోయాయి. ప్రధాన కూడళ్లలో మాత్రం ట్రాఫిక్ పోలీసులు కనిపించారు. జిల్లాలో జాతీయ రహదారుల్లో రవాణా వ్యవస్థ స్తంభించింది. దుకాణాలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంకులు మూసేశారు.
ఇదీ చూడండి: