పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటలలోపు నిత్యావసరాలను ప్రజలు కొనుగోలు చేశారు. రహదారులు, వీధులు నిర్మానుష్యంగా మారాయి. నగరంలోని పెద్ద మార్కెట్కు పెద్ద ఎత్తున ప్రజలు చేపలు మాంసాహారం కొనుగోలు చేసేందుకు వచ్చేవారు. అలాంటిది కర్ఫ్యూ నేపథ్యంలో మార్కెట్ అంతా నిర్మానుష్యంగా మారింది. దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు, ప్రత్యేక పూజలు నిలిపివేశారు.
ఇదీ చూడండి: