JAIN RYALEE: ఉపవాస దీక్ష విరమణ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జైనులు నిర్వహించిన రథాల ర్యాలీ కన్నుల పండుగగా సాగింది. జైన మత సంప్రదాయం ప్రకారం ఉపవాసం చేసిన దీక్షాపరులు రథాలపై కూర్చోగా... వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన జైనులు, మహిళలు పాదయాత్రగా ర్యాలీలో పాల్గొన్నారు. జైన సంప్రదాయాల్లో 13 నెలలు రోజు విడిచి రోజు ఉపవాస దీక్ష పాటిస్తారు. సమీపంలోని జైన దేవాలయంలో అభిషేకం నిర్వహించి బంధువుల సమక్షంలో దీక్ష విరమిస్తారు. 27 మంది దీక్షలు చేపట్టగా వారిని రథాలపై ఊరేగించారు. జైన సంప్రదాయంలో 13 నెలలు ఉపవాస దీక్ష చేపడితే తమ జీవితాలు సుఖంగా సాగడంతో పాటు భగవంతుని ఆశీస్సులు లభిస్తాయనే నమ్మకంతోనే ఇది చేస్తారని జైన మత పెద్దల నమ్మకం..
ఇదీ చదవండి: తెదేపాది అనవసర రాద్ధాంతం.. అందుకే జగన్కు పట్టం: మంత్రి రోజా