పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో గోల్మాల్ జరిగింది. అధికార పార్టీకి చెందిన ఓ నేత తన ఆయిల్ ఫామ్ తోటలో సుమారు 80 మంది కూలీలతో అక్రమంగా చేయించిన పని వివాదంగా మారింది. ఈజీఎస్ ఇన్ఛార్జి ఏపీవో రాజేశ్ సోమవారం విచారణ నిర్వహించారు. గ్రామంలోని ఎర్ర చెరువులో పని చేసేందుకు అనుమతి తీసుకుని... 80 మంది కూలీలతో మూడు రోజులపాటు ఆయిల్ ఫామ్ చెట్ల చుట్టూ పల్లాలు చేయించారు. సుమారు 45 వేల రూపాయల పనిని ఫీల్డ్ అసిస్టెంట్ సహకారంతో అక్రమ మార్గంలో చేయించారు. ఎటువంటి అనుమతి లేకుండా ఆయిల్ ఫామ్ తోటలో చేసిన పనిని గుర్తించిన కొందరు యువకులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావటంతో అవకతవకలు బయటపడ్డాయి. కరోనాతో జీవనోపాధి లేక ఉపాధి పనులు చేసుకుంటూ కాలం గడిపే తమ కష్టాన్ని అధికార పార్టీ నేత దోచుకోవడం బాధాకరమని కూలీలు వాపోతున్నారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి
ఉపాధి హామీ పని పేరుతో వైకాపా నేత తోటలో పనులు
ఉపాధి హామీ పథకం పనుల పేరుతో అధికార పార్టీకి చెందిన ఓ నేత తన తోటలో కూలీలతో పనులు చేయించుకున్నారు. చెరువులో పనికి తీసుకున్న అనుమతితో ఈ పనులు చేయించుకున్నారు సదరు నేత. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.