MLA Kotamreddy Sridhar Reddy Chit Chat at Assembly Premises : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆయన అసెంబ్లీకి వస్తే ఓ నమస్కారం పెట్టాలని చూస్తున్నట్లు విమర్శించారు. అయినా ఆయన రావడం లేదని వ్యంగాస్త్రాలు సంధించారు. రోజూ ఓ గంట సమయం జగన్‌కు మాట్లాడే అవకాశం కల్పిస్తామని లిఖితపూర్వకంగా రాసిస్తే శాసనసభకు వస్తారేమోనని ఎద్దేవాచేశారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో కోటంరెడ్డి చిట్‌చాట్ నిర్వహించారు.
జగన్ ఏం మాట్లాడినా అడ్డు చెప్పమని హామీ ఇస్తే అసెంబ్లీకి వస్తారేమోనని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీలో తాను మినహా ఎవరూ మాట్లాడటానికి వీల్లేదనే తత్వం ఆయనదని విమర్శించారు. 2014-19 మధ్య ప్రతిపక్ష నేతగా జగన్ అసెంబ్లీలో ఎప్పుడు గొడవ పడినా మైక్ కోసమే తప్ప ప్రజాసమస్యలు కోసం కాదని గుర్తు చేశారు. వారి పార్టీ ఎమ్మెల్యేలతోనూ మైక్ కోసమే గొడవ చేయించేవారని కోటంరెడ్డి అన్నారు.
2017లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వెళ్లే సమయంలో అసెంబ్లీ బాధ్యత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి గాని ఇంకెవరికైనా అప్పగించి వెళ్తే బాగుండేదని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కానీ జగన్ అలా చేయలేదంటే ఆయన మినహా మిగతావారెవరూ మాట్లాడటం ఇష్టం లేదని అర్ధమని శ్రీధర్‌రెడ్డి స్పష్టంచేశారు.
జగన్ అసెంబ్లీకి రారని పందేలు నడుస్తున్నాయి - 10మంది ఎమ్మెల్యేలూ సహకరించట్లేదు : అనిత