ETV Bharat / state

బిల్లులు చెల్లించినా కాంట్రాక్టర్​ నిర్లక్ష్యం - నత్తనడకన పనులు

అంచనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మొక్కుబడిగా పనులు - ప్రశ్నిస్తే కాంట్రాక్టర్​ దురుసు ప్రవర్తన

Road Works Slow in Nellore
Road Works Slow in Nellore (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Updated : 11 minutes ago

New Development Bank Road Project In Nellore: పనులు దక్కించుకున్నది ఒకరు. చేసేది మరొకరు. పోనీ వాళ్లు అయినా సమయానికి పూర్తి చేశారా అంటే అదీ లేదు. ఐదేళ్ల క్రితం మొదలైన రోడ్డు నిర్మాణ పనులు ఇప్పటికీ నత్తనడకన సాగుతున్నాయి. నెల్లూరు జిల్లా దగదర్తి-బుచ్చిరెడ్డిపాళెం మధ్య 16 గ్రామాల ప్రజలు రోడ్డు పనులు పూర్తికాక అవస్థలు పడుతున్నారు. తరచూ రోడ్ల మీద ప్రయాణించే ప్రయాణికులు వీటి వల్ల పలు ప్రమాదాలకు గురి అవుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం మొద్దు నిద్ర వహించడం కారణంగా తమకు ఈ పరిస్థితి వచ్చిందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

నెల్లూరు జిల్లాలోని కావలి, నెల్లూరు, గూడూరు డివిజన్లలో ఆరు ప్రధాన రహదారులను రెండు వరుసలుగా విస్తరించడానికి మూడేళ్ల క్రితం టెండర్లు పిలిచారు. న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు నిధులతో నిర్మాణం చేస్తున్నారు. రాష్ట్ర ప్రధాన రహదారుల విస్తరణ, పటిష్టం చేసేందుకు ప్యాకేజీ టెండర్లను భవానీ కన‌స్ట్రక్షన్స్‌ సంస్థ దక్కించుకుంది. ఈ ప్యాకేజి కింద వ్యయం 87.58 కోట్ల రూపాయలు కాగా దగదర్తి-బుచ్చిరెడ్డిపాళెం రోడ్డుకు 38 కోట్లు నిధులు కేటాయించారు. ఈ నిధుల్లో 70 శాతం ఎన్డీబీ, 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఒప్పందం ప్రకారం 24 నెలల్లో పనులు పూర్తి చేయాలి. కానీ ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు సాగుతుంది.

అడుగుకో గొయ్యి.. గజానికో గుంత.. 'మా రహదారులకు దిక్కెవరు..?'

గుత్తేదారు నిర్లక్ష్యం: టెండరు దక్కించుకున్న గుత్తేదారు సంస్థ పనులను ఉప గుత్తేదారుకు అప్పగించింది. గత ప్రభుత్వంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఉప గుత్తేదారు పనులను అసంపూర్తిగా వదిలివేశారు. కనీసం చేసినంతవరకైనా సక్రమంగా చేయలేదు. రోడ్లన్నీ అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులపై కట్టిన వంతెనలకు అప్రోచ్ రోడ్లు నిర్మించకపోవడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.దగదర్తి నుంచి బుచ్చిరెడ్డిపాళెం వరకు రోడ్డు నిర్మాణంలో రోలింగ్ సరిగా లేక వర్షాలకు భారీ గోతులు ఏర్పడ్డాయి. రాత్రి సమయాల్లో ప్రజలు ఈ రోడ్డుపై వెళ్లలేక పోతున్నారు. చేసిన పనులన్నీ దెబ్బతిని కంకర బయటకు వచ్చి వాహనాలు పడిపోతున్నాయి.

ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీరు నిలిచి రహదారులు ప్రమాదకరంగా మారాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లాలన్నా, చివరకు పొలాలకు వెళ్లాలన్నా అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం దీనిపై స్పందించి సకాలంలో పనులను పూర్తి చేయాలి. -స్థానికులు

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత స్థానిక నాయకుల ఒత్తిడితో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని సీఎంకు సమస్య వివరించారు. ఆయన చొరవతో గుత్తేదారుకు రావలసిన బిల్లులు చెల్లింపులు చేశారు. బిల్లులు తీసుకున్న గుత్తేదారు అంచనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మొక్కుబడిగా పనులు ప్రారంభించారు. ఇదేంటని ఉపగుత్తేదారును ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు అంటున్నారు.

హడావుడి చేశారు, అర్ధాంతరంగా ఆపేశారు - నిత్యం నరకం చూస్తున్నామంటున్న రైతులు

రాష్ట్రంలో నరకప్రాయంగా రోడ్లు.. నిరసనలు వెల్లువెత్తుతున్న పట్టించుకోని ప్రభుత్వం!

Last Updated : 11 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.