పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 75,500 రూపాయల నగదు, 15 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను సీఐ ఆంజనేయులు ఆదివారం మీడియా సమావేశంలో వివరించారు. భీమవరానికి చెందిన పాండు ప్రధాన బుకీగా బెట్టింగ్‌లు నిర్వహించాడు. ఇతనికి మొగల్తూరుకు చెందిన తుమ్మ మురళీ కృష్ణ సబ్ బుకీగా కొనసాగుతున్నాడు.
పక్కా సమాచారం అందుకున్న పోలీసులు... శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌పై మురళీకృష్ణ సబ్ బుకీగా సాగుతున్న బెట్టింగులపై దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. వీరి సెల్ ఫోన్లలో కాల్ డేటాతో మరో 18 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో 14 మందిని అరెస్టు చేసి ఆదివారం మీడియా ముందు హాజరుపరిచారు.
పట్టుబడిన నిందితులతో పాటు మరో నలుగురు డిజిటల్ పేమెంట్ల ద్వారా బెట్టింగ్‌లకు పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని సీఐ ఆంజనేయులు వెల్లడించారు. మురళి కృష్ణ బ్యాంకు ఖాతాలో ఉన్న 1,50,000 రూపాయల నగదు సీజ్ చేశామన్నారు. ప్రధాన బుకీ పాండుతో పరారీలో ఉన్న ఇతర బెట్టింగ్ బాబులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు.
ఇదీ చదవండి: