ఉల్లి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నాసిరకం ఉల్లిపాయలు రూ. 50 ఉండగా మేలురకం ఉల్లిపాయలు 70 నుంచి 80 రూపాయల వరకు ధర పలుకుతోంది. ఈ కారణంగానే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని ఉల్లి మార్కెట్లో విజిలెన్స్ అధికారులు తనిఖీ నిర్వహించారు. ఉల్లి క్రయ, విక్రయాలకు సంబంధించి అధికారులు ఆరా తీశారు. హోల్సేల్గా వ్యాపారం చేసే వాళ్ల దగ్గర 500 క్వింటాళ్లు... రిటైల్ వ్యాపారం చేసే వారి దగ్గర వంద క్వింటాళ్ల ఉల్లి మాత్రమే ఉండాలని విజిలెన్స్ డీఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించారు. అంతకంటే ఎక్కువ నిల్వ ఉంటే కేసు నమోదు చేస్తామని తెలిపారు. కొన్ని ప్రదేశాలలో మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లిని నిల్వ చేస్తున్నారని అందుకే జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడులు