పశ్చిమగోదావరిజిల్లా పెదవేగి మండలం చినకడిమి వద్ద అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనాలను.. స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమ్మిలేరు నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా రహదారిపైకి తరలించి.. అక్కడి నుంచి జేసీబీ, టిప్పర్ల సాయంతో రవాణా చేయడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో ఎస్ఈబీ అధికారులు ఆ వాహనాలను పట్టుకున్నారు. భారీస్థాయిలో ఇసుక అక్రమ రవాణ సాగుతోందని.. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: దుర్గగుడి ఈవో ఎంవీ సురేశ్ బాబుపై బదిలీ వేటు