పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేశారు. సుబ్బమ్మదేవి ప్రభుత్వ పాఠశాల ఆట స్థలంలో అక్రమంగా కొందరు ప్రైవేటు వ్యక్తులు బహుళ అంతస్తుల భవనాలను నిర్మించారు. ప్రజాసంఘాలు ఆందోళన చేపట్టడంతో విచారణ చేపట్టిన నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేత పనులు చేపట్టారు. ఏలూరు నగరపాలక సంస్థ మాజీ ఉపమేయర్ నాయుడు పోతురాజు కుటుంబ సభ్యులే ఈ స్థలాన్ని ఆక్రమించారని అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి : ఆడ పిల్లలకు రక్షణ కరువైంది