ETV Bharat / state

ద్వారకాతిరుమలలో హుండీ లెక్కింపు.. శ్రీవారికి భారీగా ఆదాయం - ద్వారకాతిరుమలలో శ్రీవారికి భారీగా సమకూరిన ఆదాయం

గత 20 రోజుల్లో హుండీ ద్వారా శ్రీవారికి భారీగా ఆదాయం సమకూరింది. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల దేవస్థానంలో ఇవాళ లెక్కింపు చేపట్టగా.. రూ. 1.42 కోట్ల నగదు, 235 గ్రాముల బంగారం, 8.845 కేజీల వెండి స్వామివారికి కానుకలుగా వచ్చినట్లు ఆలయ ఈవో సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

hundi counting in dwaraka tirumala temple, huge income to srivaru at dwaraka tirumala temple
ద్వారకాతిరుమలలో హుండీ లెక్కింపు, శ్రీవారికి భారీగా సమకూరిన ఆదాయం
author img

By

Published : Apr 19, 2021, 7:12 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి హుండీ ద్వారా రూ.1.42 కోట్లు ఆదాయం సమకూరినట్లు ఈవో జీవీ సుబ్బారెడ్డి తెలిపారు. గడచిన 20 రోజుల హుండీ ఆదాయాన్ని అధికారులు ఇవాళ లెక్కించారు. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో.. భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ ఈవో ఆధ్వర్యంలో దేవాలయ సిబ్బంది లెక్కింపు నిర్వహించారు.

ఇదీ చదవండి: భళా బంధకళ.. అబ్బురపరుస్తున్న చేనేత చీరలు

గడచిన 20 రోజులకుగాను జరిగిన ఈ హుండీ లెక్కింపులో.. శ్రీవారికి నగదు రూపేణా రూ. 1,42,44,793 ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో సుబ్బారెడ్డి ప్రకటించారు. భక్తులు సమర్పించిన కానుకల రూపేణా 235 గ్రాముల బంగారం, 8.845 కేజీల వెండి వచ్చినట్లు పేర్కొన్నారు. విదేశీ కరెన్సీ సైతం హుండీలో భారీగానే లభ్యమైనట్లు చెప్పారు.

ఇదీ చదవండి:

శ్రీరామనవమికి శ్రీ వారి ఆలయంలో ఆస్థానం నిర్వహణ: తితిదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.