సమీకృత సాగులో లాభాలు గడిస్తున్న రైతులు
సాధారణ పద్ధతిలో సాగు చేస్తున్న అన్నదాతకు... ఏదో ఒక రూపంలో నష్టాలు తప్పడం లేదు. పెరుగుతున్న పెట్టుబడి వ్యయం...తగ్గుతున్నఆదాయం రైతుకు కష్టాలు తెచ్చిపెడుతోంది. ఈ సమస్యను అధికమించేందుకు..సమీకృత సాగు చేపట్టిన అనేకమంది రైతులు సత్ఫలితాలు పొందుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో రైతులు సమీకృత వ్యవసాయంలో లాభాలు అర్జిస్తున్నారు. ఎకరం పొలంలోనే వరి సాగు, చేపల పెంపకం, ఉద్యాన, కూరగాయలు పంటలు వేస్తూ..లాభాలు గడిస్తున్నారు. సమీకృత వ్యవసాయానికి ఎకరం పొలాన్ని ఎంచుకుంటున్న రైతులు అందులో 50శాతం వరి, 25శాతం చేపలు పెంపకం, 25శాతం ఉద్యానపంటలు... సాగు చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు. సమీకృ పంటను సాగు చేసేందుకు అవసరమైన మెలుకువలను అధికారులు అందిస్తున్నారు.
ప్రభుత్వ రాయితీ..
సమీకృత వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. ఎకరాకి...57వేల రూపాయల ఆర్థికసాయం అందిస్తోంది. జిల్లాలో సమీకృత సాగుకు ఎంపిక చేసిన 200 గ్రామాల్లో 125యూనిట్లు మంజూరు చేశారు. 6నుంచి 8క్వింటాళ్ల చేపల విక్రయం ద్వారా 70వేల రూపాయలు... ఆదాయం రైతుకు అందుతుంది. వరి ద్వారా మరో..30వేల సమకూరుతుంది. ఉద్యానపంటలు, కూరగాయల విక్రయం, ఇంటికి వినియోగించుకోవడం ద్వారా ఆదాయం వస్తుంది.
లాభాల పంట..
సమీకృత వ్యవసాయంలో రైతులు..నష్టాల నుంచి లాభాల వైపు వెళ్తున్నారు. సాధారణ పంటల సాగుతో పోల్చితే ఈ విధానం బాగుందని చెబుతున్నారు.
ఇదీ చూడండి.
సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు..రాత్రి 7 దాటినా తగ్గని సెగ