పశ్చిమగోదావరి జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలు పశ్చిమగోదావరి జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు గ్రామాల్లోని ఆంజనేయ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉండ్రాజవరం మండలం పాలంగిలోని స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. పెరవలి జాతీయ రహదారి పక్కన గల అభయాంజనేయ ఆలయంలో లక్ష తమలపాకులతో పూజలు చేశారు. జంగారెడ్డిగూడెం గుర్వాయగూడెంలో స్వామి వారిని వేకువ జామునే పంచామృతాలతో అభిషేకించారు. వడమాలలు సమర్పించారు. అన్నదానం చేశారు.
ఇవీ చదవండి..ఘనంగా శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ రథోత్సవం