పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులో అక్రమంగా నిల్వఉంచిన నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గుట్కా విలువ రూ.75 వేలు ఉంటుందని ఎస్ఐ వీర్రాజు తెలిపారు. గ్రామానికి చెందిన ప్రగళ్లపాటి వెంకటరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసునమోదు చేసినట్లు వెల్లడించారు. నిషేధిత పధార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీచదవండి