పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజవర్గం జీలుగుమిల్లి రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద శనివారం ఒడిశా వలసకూలీల బస్సులకు అనుమతి ఇచ్చారు ఆంధ్రా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వద్ద వాహన తనిఖీలు ముమ్మరం చేసిన అధికారులు ప్రతి వాహనాన్ని పరిశీలిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి రెండు బస్సులు ఐదు ఇతర వాహనాల్లో ఒడిశాకి వెళ్తున్న వలస కూలీలను రాష్ట్ర సరిహద్దు వద్ద అడ్డుకున్నారు. ప్రతి వలస కూలీ వివరాలు నమోదు చేసుకొని సాయంత్రం వాహనాలను ఆంధ్రా సరిహద్దు వద్ద విడిచిపెట్టారు. సుమారు 100 మంది వలస కూలీలు తమ సొంత గ్రామాలకు వెళ్లి పోయారు. ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే వాహనాలను అడ్డుకొని వెనక్కి పంపించారు. క్వారంటైన్ వెళ్లే వారికి మాత్రమే ఆంధ్రాలోకి అనుమతిస్తున్నారు. తెలంగాణ అధికారుల అనుమతి ఉన్నప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలోకి వాహనాలను అనుమతించకపోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా కొన్ని వాహనాలను మాత్రమే అనుమతి ఇవ్వడం పట్ల విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇదీ చూడండి ఎల్జీ పరిశ్రమ గేటు ముందు మృతదేహాలతో స్థానికులు ఆందోళన