భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరదకు గోదావరి నది ఉప్పొంగుతోంది. గత 5 సంవత్సరాలుగా ఎన్నడూ లేనంతగా తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరిగింది. పరీవాహక ప్రాంత ప్రజలు భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. గత ఐదేళ్లలో భద్రాచలం వద్ద గరిష్ఠ నీటిమట్టం 55 అడుగులకు మించలేదు. అయితే ప్రస్తుతం అక్కడ 55 అడుగులు దాటేంతగా ప్రవాహం పోటెత్తుతోంది. ఫలితంగా అక్కడ మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.
ఈ నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో 90 కిలోమీటర్లకు పైగా గోదావరి తీర ప్రాంతం ఉంది. ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇప్పటికే పెరవలి మండల పరిధిలోని ఖండవల్లి, ముక్కామల, తీపర్రు, కాకరపర్రు తదితర గ్రామాల పరిధిలో తోటలు నీటమునిగాయి. 2, 3 రోజుల్లో వరద నీరు బయటకు పోకపోతే తోటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు కంగారు పడుతున్నారు.
ఇవీ చదవండి: