ETV Bharat / state

చెరువు లాభం యజమానికి... కాలుష్యం గోదావరి డెల్టాకు...

ఆక్వా చెరువులతో గోదావరిడెల్టా నానాటికీ తరిగిపోతోంది. పచ్చని వరి చేలతో అలరారే డెల్టా ప్రాంతం..దురాక్రమణ చెరలో మగ్గుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏటా వేసవిలో వేల ఎకరాల రొయ్యల చెరువులు పుట్టుకొస్తున్నాయి. చేపల చెరువుల మాటున..రొయ్యల చెరువులు తవ్వుతూ..గోదావరిడెల్టాను కాలుష్యకోరల్లోకి నెడుతున్నారు.

Godavari Delta into the pollutants with shrimp ponds
దురాక్రమణకు గురవుతున్న డెల్టా ప్రాంతం
author img

By

Published : May 29, 2020, 10:48 AM IST

రైతులకు అధిక ఆదాయం తెచ్చే వనరుగా చెప్పుకొనే ఆక్వారంగం పెను విధ్వాంసాన్నే సృష్టిస్తోంది. దశాబ్దాలుగా కోస్తాంధ్రాలో వేళ్లేసుకుపోయిన ఈ ఆక్వా సాగు..లక్షల ఎకరాలను నిస్సారం చేస్తోంది. ప్రధానంగా పశ్చిమగోదావరి జిల్లాలో పచ్చని మాగణి.. ఉప్పునీటి నేలగా మారుతోంది. మూడు పంటలు పండే గోదావరి డెల్టా భూముల్లో... గడ్డిమొలక మొలవని దురావస్థకు చేరింది.

దురాక్రమణకు గురవుతున్న డెల్టా ప్రాంతం

నాయకుల అండతో ఆక్వా చెరువులుగా మార్పు

అనుమతిచ్చిన విస్తీర్ణం కంటే లక్షల ఎకరాలు అధికంగా ఆక్వాచెరువులు తవ్వినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ అండదండలు, అధికారుల అభయహస్తంతో గోదావరి డెల్టా భూములను ఆక్వా చెరువులుగా మారుస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏడులక్షల ఎకరాల్లో డెల్టా భూములు ఉన్నాయి. ఏటా సుమారు 10వేల ఎకరాల్లో కొత్తగా రొయ్యల చెరువులు తవ్వుతున్నారు. డెల్టాలో వ్యవసాయం తగ్గడం వల్ల.. వ్యవసాయ కూలీలకు ఉపాధి కరువవుతోంది. కాలుష్యం కోరలుచాచి డెల్టాను కాటేస్తోంది.

నిబంధనలు కాగితాలకే పరిమితం..

రొయ్యల చెరువులు తవ్వాలన్నా.. సాగుచేయాలన్న అనుమతులు తీసుకోవాలి. కాలుష్య విధ్వంసాన్ని దృష్టిలో ఉంచుకొని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇవేమీ రొయ్యల చెరువుల తవ్వకాల్ని అడ్డుకోలేకపోతున్నాయి. ఈ నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమై... రైతులను వెక్కిరిస్తున్నాయి. రాజకీయం పలుకుబడి ఉన్నవారు యథేచ్ఛగా రొయ్యల చెరువులు తవ్వుతున్నారు. ఇంతా జరుగుతున్నా యంత్రాంగం చోద్యం చూస్తోంది.

అనుమతుల్లేవ్...

ఏ ప్రాంతంలోనైనా రొయ్యల చెరువు సాగుచేయాలంటే.. ముందుగా జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీతో అనుమతి తీసుకోవాలి. ఆయా గ్రామాల్లో రొయ్యల చెరువు తవ్వాలంటే..గ్రామంలో రైతుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ నిబంధనలు పాటించకుండా చెరువులు తవ్వేశారు. చేపల చెరువుల ముసుగులో భారీగా రొయ్యల సాగుచేస్తున్నారు.

జిల్లాలో అధికారికంగా సుమారు 80వేల ఎకరాల్లో రొయ్యల చెరువులు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఐతే అనధికారికంగా 2లక్షల ఎకరాలకు పైగా రొయ్యల చెరువులు సాగుచేస్తున్నారు. ఏటా వేల ఎకరాల డెల్టా ఆయకట్టు రొయ్యలచెరువులుగా మారుతోంది. పచ్చని గ్రామాల్లో రొయ్యల చెరువులు కార్చిచ్చు రగిలిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రొయ్యల చెరువులసాగుపై అధికారులు దృష్టిసారించాలని రైతులు అంటున్నారు. అనుమతిలేని చెరువుల్ని ధ్వంసం చేసి...గోదావరిడెల్టాను కాపాడాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి: ఈ మిడతలు... పక్కా లోకల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.