చదువుతో పాటు విద్యార్థులు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని జూనియర్ కళాశాల ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ప్రభాకర్ రావు సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది.జిల్లాలో 34 ప్రభుత్వ, 14 ఎయిడెడ్, 9 సాంఘిక సంక్షేమ, 3 గిరిజన సంక్షేమ, 162 ప్రైవేటు జూనియర్ కళాశాలలు, కేజీబీవీ కాలేజీలో మొత్తం 70 వేల మంది విద్యార్థులు ఉన్నట్టు వెల్లడించారు. ప్రైవేటు కళాశాలలో విద్యార్థులు కేవలం చదువులకు మాత్రమే పరిమితం అవుతున్నారని తెలిపారు. క్రీడల్లో రాణించే విద్యార్థులను ఆయా కళాశాల ప్రధానోపాధ్యాయులు, పీడీలు సహకరించాలన్నారు.
ఇది కూడా చదవండి.