పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం జాతీయ రహదారిపై చేబ్రోలు వద్ద పోలీసుల వాహన తనిఖీల్లో గంజాయి పట్టుబడింది. రెండు ద్విచక్ర వాహనాలపై తరలిస్తున్న 7.250 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఏలూరు పట్టణం తూర్పు వీధికి చెందిన సాలాపు రాజు చెడు వ్యసనాలకు బానిసై.. సులువుగా డబ్బులు సంపాదించేందుకు గంజాయి రవాణాను ఎంచుకున్నాడు. దీని కోసం ఏలూరు పరిసర ప్రాంతాలకు చెందిన పసల శ్యాంసుందర్, బెజవాడ పవన్ కుమార్, తెర్లి రాజేష్‌లతో కలిసి.. గంజాయి వ్యాపారాన్ని మెుదలుపెట్టాడు.
విశాఖపట్నం జిల్లా పాడేరు నుంచి గంజాయిని కొనుగోలు చేసి.. ఏలూరుతో పాటు పరిసర ప్రాంతాల్లో విద్యార్థులకు ఎక్కవ ధరకు అమ్మి డబ్బు సంపాదించటం మెుదలుపెట్టారు. ఈ క్రమంలోనే గంజాయిని రవాణా చేస్తుండగా చేబ్రోలు వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. నలుగురు యువకులపై కేసు నమోదు చేసి గంజాయితో పాటు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చేబ్రోలు ఎస్సై వీర్రాజు తెలిపారు.
ఇదీ చదవండి: పోలవరం దగ్గర కొనసాగుతున్న గోదావరి ఉద్ధృతి