పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎనిమిదో విడత ఉచిత రేషన్ పంపిణీ నేటి నుంచి ప్రారంభమైంది. కార్డులో ఉన్న ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం, కిలో శనగలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కరోనా విపత్తు ఉద్ధృతంగా ఉండటంతో నవంబర్ నెల వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉచిత బియ్యం పప్పు ధాన్యాలు పంపిణీ పొడిగించారు.
ఈ నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులు కొనుగోలు చేసే పద్ధతిలో సరకులు సరఫరా చేయాలని నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 90 వేల కోట్ల రూపాయల వ్యయంతో నవంబర్ నెల వరకు ఉచితంగా బియ్యం, ధాన్యాలు సరఫరా చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ నెల మొదటి వారంలో కార్డుదారులకు బియ్యం కందిపప్పు ఉచితంగా ఇస్తూ పంచదారకు మాత్రం అరకిలో 17 రూపాయలు, అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకు కిలో 13.50 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు.
ఇదీ చూడండి