ETV Bharat / state

రాజధానిపై నా అభిప్రాయాన్ని గతంలోనే చెప్పా..!: వెంకయ్యనాయుడు

Former Vice President Venkaiah Naidu: భీమవరంలోని ఎస్ఆర్ కేఆర్ కళాశాల 43వ వార్షికోత్సవం కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... ఎంత ఉన్నత స్థితికి చేరుకున్నా, ఉన్న ఊరిని, కన్న తల్లిని, మాతృ భాషను మరువకూడదన్నారు. ఆదాయం పెంచిన తర్వాతే, పంచడంపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఈ సూత్రం వ్యక్తులకైనా, ప్రభుత్వాలకైనా వర్తిస్తుందన్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Feb 11, 2023, 8:10 PM IST

Updated : Feb 12, 2023, 6:21 AM IST

Bhimavaram SR KR College 43rd Anniversary: రాష్ట్ర రాజధాని అంశంపై తన ఆలోచనలు, అభిప్రాయాలను గతంలోనే స్పష్టంగా చెప్పానని....అయినా రాజకీయాల్లో లేనందున వివాదాల్లో ఉన్న అంశాలపై స్పందించడం మంచిది కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. భీమవరంలోని ఎస్ఆర్ కేఆర్ కళాశాల 43వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐడియా ల్యాబ్ ను వెంకయ్య ప్రారంభించారు. అనంతరం ల్యాబ్ మొత్తం కలియతిరిగిన ఆయన విద్యార్థులు రూపొందించిన నూతన ప్రాజెక్టులు, వాటి పనితీరును అడిగితెలుసుకున్నారు.

అనంతరం కళాశాల సముదాయంలో చిరు ధాన్యాల ప్రాధాన్యతను భావి తరాలకు తెలిసేలా ఏర్పాటు చేసిన సృజన వాటికను సైతం వెంకయ్య నాయుడు సందర్శించారు. విద్యార్థులకు పలు సలహాలు, సూచనలు చేసిన వెంకయ్య నాయుడు.. ఎంత ఉన్నత స్థితికి చేరుకున్నా, ఉన్న ఊరిని, కన్న తల్లిని, మాతృ భాషను మరువకూడదన్నారు. ఆదాయం పెంచిన తర్వాతే, పంచడంపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఈ సూత్రం వ్యక్తులకైనా, ప్రభుత్వాలకైనా వర్తిస్తుందన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రశ్నలకు సమాధానమిచ్చిన వెంకయ్య నాయుడు.. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ప్రధాని మోదీతో కలిసి శంకుస్థాపన చేయడంతో పాటుగా...కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా అమరావతి నిర్మాణం కోసం నిధులు విడుదల చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. చివర్లో 2022 విద్యా సంవత్సరానికి గాను కళాశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వెంకయ్య బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు.

'ఎంత ఉన్నత స్థితికి చేరుకున్నా, ఉన్న ఊరిని, కన్న తల్లిని, మాతృ భాషను మరువకూడదు. అలా మరిచిపోయిన వాడు మానవుడే కాదు. ఆదాయం పెంచిన తర్వాతే, పంచడంపై దృష్టి పెట్టాలి. ఈ సూత్రం వ్యక్తులకైనా, ప్రభుత్వాలకైనా వర్తిస్తుంది. ప్రపంచానికి బట్టలు కట్టుకోవడం తెలియని సమయంలో మన సంస్కృతి ఉండింది ఆరోజుల్లో. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ప్రధాని మోదీతో కలిసి శంకుస్థాపన చేసిన విషయం మీ అందరికి తెలిసిందే. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అమరావతి నిర్మాణం కోసం నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే'-. వెంకయ్య నాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఇవీ చదవండి:

Last Updated : Feb 12, 2023, 6:21 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.