పోలవరంలో వరద గంట గంటకు పెరుగుతుంది. తీవ్రమవుతున్న వరదకి కడెమ్మ వంతెనపైకి వరద నీరు చేరుకుంది. దీంతో పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతానికి రాకపోకలు నిలిచాయి. అంతేగాక..పోలవరం సమీప గ్రామాల్లో సుమారు 5 వేల ఎకరాల్లో పంట నీట మునిగింది.. ఆ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలైన తూటుగుంట, మాధవపురం, కొత్తూరు, వాడపల్లి తదితర గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. అధిక నీరు కడెమ్మ వంతెనపైకి చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదీచూడండి.ఉప్పొంగుతున్న నదులు... ఇక్కట్లలో ప్రజలు