ETV Bharat / state

క్షణక్షణం గండం... ఏ గట్టు.. ఎప్పుడు తెగుతుందో! - గోదావరి గట్లు తెగుతున్నాయి

గోదావరికి వరద వచ్చిన ప్రతిసారి.. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకుండదు. గట్లు బలహీనంగా మారి.. ఊళ్లమీదకు వరద ఎప్పుడు విరుచుకుపడుతుందో అన్న భయాందోళనల మధ్య బతకాల్సి వస్తోంది. గోదావరి గట్లు బలహీనంగా మారిన ఫలితంగా పశ్చిమ గోదావరిజిల్లాలోని గ్రామాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో గట్టు కోతకు గురై బలహీనంగా మారుతోంది. ఫలితంగా గండ్లు ఏర్పడి గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశిస్తోంది.

flood effects on  Godavari river beds
flood effects on Godavari river beds
author img

By

Published : Aug 18, 2020, 5:20 PM IST

వరద బాధితులతో ఈటీవీ భారత్​

గోదావరికి రికార్డు స్థాయిలో వరద రావడంతో గట్ల పరిస్థితి ప్రశ్నార్థకమైంది. బలహీనంగా ఉన్న గట్లకు గండ్లుపడి.. వరదనీరు గ్రామాల్లోకి ప్రవేశిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి వరద తాకిడితో ఈ బలహీనత బయటపడింది. పోలవరం నుంచి కొవ్వూరు వరకు గట్టు కోతకు గురికావడం, తూరలు పడటంతో వరద నీరు గ్రామాల్లోకి వస్తోంది.

గత ఏడాది చిన్నపాటి వరదకే గోదావరి గట్టు ప్రమాద అంచుకు చేరుకొంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో వచ్చిన వరదతో పోలవరం పరిసరాల్లో గట్లు దెబ్బతిన్నాయి. మూడు చోట్ల తూరలు ఏర్పడి వరద నీరు పాత పోలవరంలోకి ప్రవేశించింది. సుమారు 5 అడుగుల మేర నీరు నిలిచింది. ఈ తూరలు పెరిగితే.. 20 వేల జనాభా ఉన్న పోలవరం గ్రామం ఖాళీ చేయాల్సి ఉంటుంది.

అయితే.. కాస్త ఆలస్యంగా స్పందించిన అధికారులు గట్లకు తూరలు పడిన ప్రాంతాల్లో ఇసుక బస్తాలు వేయిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో రాళ్లు, మట్టి పోస్తున్నారు. ప్రస్తుతం పనులు చేయడానికి సైతం గోదావరి వరద అడ్డంగా వస్తోంది. వేసవిలో పనులు చేపట్టి ఉంటే.. ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని బాధితులు అంటున్నారు.

పోలవరం నుంచి దాదాపు 24 కిలోమీటర్ల మేర గోదావరి గట్లు బలహీనంగా మారాయి. ఇసుక ర్యాంపుల వద్ద గట్లను తవ్వేయడం వల్ల.. గట్లు బలహీనంగా మారుతున్నాయి. ఇసుక రవాణాకు సౌకర్యవంతంగా ఉండడానికి.. గట్లను తవ్వెస్తున్నారు. దీంతో గట్లను బలహీనంగా మారుతున్నాయి. వరద వచ్చిన సమయంలో గండ్లుపడి గోదావరి పరివాహక గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశిస్తోంది.

పోలవరం వద్ద నెక్లెస్ బాండును రాతికట్టడంతో పటిష్టం చేయాలని గ్రామాస్థులు పదేళ్లుగా అడుగుతున్నారు. కానీ సమస్యలను పట్టించుకునే వారే కరవయ్యారు. దీంతో వరదల దాటికి పాత పోలవరంలో నివాసం ఉంటున్న 400 కుటుంబాలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చుట్టుముట్టున వరదతో ఎక్కడికిపోవాలో కూడా తెలియక అనేక కష్టాలు పడుతున్నారు.

ప్రభుత్వం వెంటనే తమ సమస్యలపై దృష్టి సారించాలని కోరుతున్నారు. వరద బాధిత గ్రామాల ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే బలహీనపడిన గట్లను పునరుద్ధరించాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:

ఫోన్​ ట్యాపింగ్​పై ఎందుకు విచారణ చేయకూడదు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.