పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి తరఫున అనుచరులు డబ్బులు పంపిణీ చేయడం బహిర్గతమైంది. దినసరి కూలీలను ప్రచార సభలకు తీసుకొచ్చి సాయంత్రానికి వారికి 2 వందలు చేతిలో పెట్టే దృశ్యాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. జిల్లాలోని జంగారెడ్డి గూడెంలో నిర్వహించిన ఈ సభకు పార్టీ నాయకుల నుంచి స్పందన లేనందున సమీపంలోని గ్రామాల నుంచి కూలీలను తీసుకువచ్చారు.
కొంతమంది మంది కూలీలకు నగదు పంపిణీ చెయ్యకుండా నాయకులు వెళ్లిపోయారు. దీంతో సభకు వచ్చిన వారు నడిరోడ్డుపై ఆందోళన చేశారు. అప్పటికప్పుడు స్పందించిన కొందరు నేతలు... వచ్చిన వారికి ఆటో కిరాయితో పాటు కూలి డబ్బులు చెల్లించాలించి వారిని శాంతిపజేశారు.
ప్రచారానికి కూలీలు.. బహిరంగంగానే నోట్ల పంపిణీ - west godavari
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి నిర్వహించిన ప్రచార సభకు కూలీలను తీసుకు వచ్చారు. సభ ముగిసిన వెంటనే ఒక్కొక్కరికి రూ.2వందల చొప్పున బహిరంగంగా పంపిణీ చేశారు.