ద్వారకాతిరుమల మండలం కొమ్మర గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు రైతులకు చెందిన ఆయిల్ పామ్, జామాయిల్ తోటలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న భీమడోలు ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
నక్క అయోధ్య రాజుకు చెందిన నాలుగు ఎకరాల పామాయిల్ తోట, మామిడి సత్యనారాయణకు చెందిన నాలుగు ఎకరాల జామాయిల్ తోటలో అగ్ని ప్రమాదం సంభవించింది. మొత్తం రూ.2.50 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు పేర్కొన్నారు. మంటలు చుట్టుపక్కల తోటలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది అదుపు చేశారు.
ఇది చదవండి కరోనా ఎఫెక్ట్: రెండు విడతల్లో విద్యార్థులకు తరగతులు