పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళ మండలం కోపల్లెలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం సంభవించినట్లు చెప్తున్నారు. ఈ ఘటనలో బ్యాంకులోని కంప్యూటర్లు, విలువైన సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. సూమరు రూ. 6 లక్షల మేర నష్టం జరిగినట్లు బ్యాంకు మేనేజర్ కృష్ణారావు తెలిపారు. ఉదయం బ్యాంకు తెరిచే సమయంలో లోపలనుంచి పొగలు వస్తుండటంతో అలారం మోగింది. అప్రమత్తమైన ఉద్యోగులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వగా వారు మంటలను అదుపుచేశారు.
ఇవీ చదవండి..