తూర్పుగోదావరి జిల్లా పెదపూడిలోని ఓ సైకిల్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. విషయం గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన సిబ్బంది.. అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. సుమారు రూ .15 లక్షల వరకూ ఆస్తినష్టం జరిగిందని దుకాణ యజమాని వాపోతున్నాడు.
ఇదీ చూడండి:
COUPLE SUICIDE ATTEMPT: కాకర్లలో దంపతుల ఆత్మహత్యాయత్నం...కారణం ఏంటంటే..!