పశ్చిమగోదావరి జిల్లా భీమవరం జువ్వలపాలెం రోడ్డులోని శ్రియ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో వైద్యుడి గదిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఫర్నిచర్ దగ్ధమైంది. వెంటనే స్పందించిన ఆస్పత్రి సిబ్బంది... విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. ప్రమాద సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
ఇదీచదవండి.