పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పుట్టినరోజు వేడుకలో జరిగిన కోట్లాటలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. పట్టణంలోని నల్లంవారితోటకు చెందిన మంచిన నాని తన జన్మదినం సందర్భంగా పార్టీ ఏర్పాటు చేశారు. దానికి పంపాన ప్రసాద్ అనే వ్యక్తిని పిలిచాడు. వారివురికీ పాత గొడవలు ఉన్నాయి. పార్టీ కొనసాగుతుండగా ప్రసాద్‌కు, నానికి మధ్య ఘర్షణ మొదలైంది. మద్యం మత్తులో ఉన్న ప్రసాద్ నానితో పాటు తులసి అనే ఇంకో యువకుడిపై బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటనలో వారిద్దరికీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి..