పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం తీగలవంచ గ్రామంలో గోద్రేజ్ ఆయిల్ పామ్ వేబ్రిడ్జి తూకంలో తేడాలు ఉన్నాయని రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తూనికలు, కొలతలు శాఖ అధికారి సాయిరామ్, ఉద్యాన శాఖ డిడి సుబ్బారావు మాట్లాడుతూ... రెండువేల కేజీల తూకం రాళ్లతో వేబ్రిడ్జిని తనిఖీ చేశామన్నారు.
అందులో తేడాలున్నాయని వెంటనే ట్రాక్టర్ ను వేరే వేబ్రిడ్జి వద్ద తూకం వేసి అనంతరం ఈ వేబ్రిడ్జి మీద తూకం వేస్తే 35 కేజీలకు పైగా తేడా ఉన్నట్లు గుర్తించామన్నారు. టన్ను పెరిగేకొద్ది తూకంలో తేడాలు ఉండటంతో వేబ్రిడ్జిని సీజ్ చేశామన్నారు. ఎప్పటి నుంచి ఇలా జరిగిందని పరిశీలించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి: