పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ... పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండల పరిధిలోని రైతులు తెదేపా ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కుళ్లిపోయిన వరి పంటలు చూపిస్తూ అన్నదాతలు నిరసన వ్యక్తం చేశారు. దువ్వ గ్రామంలో సుమారు 3500 ఎకరాలలో పంట నష్టం వాటిల్లిందని చెప్పారు. ఒక్కొక్క రైతు 20 వేల నుంచి 25 వేల రూపాయల వరకు పెట్టారన్నారు.
ప్రస్తుతం గింజ కూడా దక్కే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. రైతులకు పరిహారం ఇప్పించాలని... దాళ్వా విత్తనాలు, పశుగ్రాసం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
ఆపరేషన్ ముస్కాన్: చిన్నారిని తీసుకెళ్లిన పోలీసులు..ఆగిన తల్లి గుండె