తెలంగాణలోని మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి పరిధిలోని నాగిశెట్టి పల్లిలో.. రైతు ఆకుల ప్రసాద్ (45).. విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని తప్ప గ్రామానికి చెందిన ప్రసాద్.. కొంత కాలంగా నాగిశెట్టి పల్లిలో కౌలుకు వ్యవసాయం చేస్తున్నాడు. ఇవాళ ఉదయం బోరు బావి దగ్గర కరెంటు తీగలను గమనించకుండా.. వాటిపై నడిచిన కారణంగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ఘటనలో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రసాద్‌కు భార్య అన్నపూర్ణ, కుమార్తె దుర్గ ఉన్నారు.
భీమవరం రైతు... తెలంగాణలో విద్యుదాఘాతంతో మృతి -
రాష్ట్రానికి చెందిన రైతు.. తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. అతను విద్యుదాఘాతంతో చనిపోయాడు. మృతుడిది పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతుగా గుర్తించారు.
![భీమవరం రైతు... తెలంగాణలో విద్యుదాఘాతంతో మృతి భీమవరం రైతు... తెలంగాణలో విద్యుదాఘాతంతో మరణం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5978920-846-5978920-1580982502269.jpg?imwidth=3840)
భీమవరం రైతు... తెలంగాణలో విద్యుదాఘాతంతో మరణం