మహనీయులను స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం కాళింగ గూడెం పంచాయతీలో ఏర్పాటు చేసిన మాజీ ఎంపీ బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహాన్ని తమ్మినేని సీతారాం ఆవిష్కరించారు.
రాజగోపాలరావు పేద ప్రజల ఉన్నతికి, కళింగ జాతి అభ్యున్నతికి విశేష కృషి చేశారని తమ్మినేని సీతారాం అన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, ఎమ్మెల్యే మంతెన రామరాజు, ఉండి వైకాపా కన్వీనర్ పివీఎల్ నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: వినూత్నరీతిలో మాస్కులపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే