పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం, దెందులూరు ప్రాంతాల్లో నీట మునిగిన ఇళ్లు, పొలాలను దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిశీలించారు. బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. గుండేరు డ్రైన్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు.
గుండేరు డ్రైన్‌ను మరో 5 మీటర్లు వెడల్పు చేయాలని సూచించారు. ఇళ్లలోకి వరద నీరు చేరిన తీరును పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. వారికి పునరావాసం ఏర్పాటు చేయటంలో అధికారులు, ప్రభుత్వం విఫలమైందన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: