ETV Bharat / state

అధికార లాంఛనాలతో పైడికొండల మాణిక్యాలరావు అంత్యక్రియలు

మాజీ మంత్రి, భాజపా నేత పైడికొండల మాణిక్యాలరావు అంత్యక్రియలు ముగిశాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని హిందూ ధర్మ శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంత్యక్రియల్లో భార్య, కుమార్తె, అల్లుడు ఇతర బంధువులు పాల్గొన్నారు. కొవిడ్​ దృష్ట్యా కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు.

ముగిసిన పైడికొండల మాణిక్యాలరావు అంత్యక్రియలు

author img

By

Published : Aug 1, 2020, 10:30 PM IST

Updated : Aug 1, 2020, 11:10 PM IST

ప్రభుత్వ లాంఛనాలతో పైడికొండల మాణిక్యాలరావు అంత్యక్రియలు

మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అంత్యక్రియలు ముగిశాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం.. కొండాలమ్మగుడి రోడ్డులోని మామిడాల చెరువు వద్ద.. మాణిక్యాలరావు అభివృద్ధి చేసిన హిందూ ధర్మ శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. కొవిడ్​ వ్యాప్తి దృష్ట్యా నిబంధనల ప్రకారం కేవలం 20 మందికి మాత్రమే అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పోలీసులు అనుమతిచ్చారు. అంత్యక్రియల్లో ఆయన సతీమణి సూర్యకుమారి, ఆయన కుమార్తె సింధు, అల్లుడు నవీన్‌కిషోర్‌, వియ్యంకుడు గట్టిం మాణిక్యాలరావు, ఇతర బంధువులు పాల్గొన్నారు. భాజపా కార్యకర్తలు హాజరయ్యారు.

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్​ రేవు ముత్యాలరాజు ఉత్తర్వులు ఇవ్వటంతో డీఎస్పీ రాజేశ్వర్​రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. అధికార లాంఛనాల ప్రకారం.. పోలీసులు గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపి.. గౌరవ వందనం సమర్పించారు. ఆర్డీవో రచన, డీఎస్పీ రాజేశ్వర్​ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాణిక్యాలరావు చిత్రపటానికి నివాళులర్పించారు.

ఇదీ చూడండి..

కరోనాతో మాజీ మంత్రి పి.మాణిక్యాలరావు కన్నుమూత

Last Updated : Aug 1, 2020, 11:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.