కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అంతమవ్వాలని కోరుతూ... పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం బీచ్లో... నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆదేశాల మేరకు ఆయన కార్యాలయ సిబ్బంది మృత్యుంజయ హోమం నిర్వహించారు. సుమారు ఎనిమిది మంది వేద పండితులు మూడు గంటలపాటు హోమం చేశారు. అనంతరం కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని పిండ ప్రదానం చేసి సముద్రంలో కలిపారు.
ఇవీ చదవండి...ధర వెలవెల...రైతు విలవిల!