తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీస్ యాక్టు అమలులో ఉందని, ఇతరులెవరూ అంతర్వేదికి రావద్దని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు తెలిపారు. అంతర్వేది అగ్నిప్రమాద సంఘటన స్థలం వద్ద క్యాంప్‌ను ఏర్పాటు చేసినట్లు డీఐజీ తెలిపారు. ప్రమాదంపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఫోరెన్సిక్ శాఖ నిపుణులు సంఘటన స్థలం వద్ద నిశితంగా పరిశీలిస్తున్నారన్నారు. పరిసర ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొంతమంది శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రయత్నించారని అన్నారు.
- నేడు 'చలో అంతర్వేది'కి భాజపా - జనసేన పిలుపు..
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనను నిరసిస్తూ భాజపా - జనసేన నాయకులు నేడు 'చలో అంతర్వేది' పిలుపునిచ్చారు. పోలీసులు ఎక్కడికక్కడ భాజపా - జనసేన నాయకులను గృహ నిర్బంధం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం అంతర్వేదికి బయలు దేరారు.
ఇదీ చదవండి: కార్లు అద్దెకు తీసుకుని అక్రమంగా అమ్ముతున్న వ్యక్తి అరెస్టు