Eluru police chased boy kidnap case: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు గ్రామీణ మండలం వెంకటాపురంలో బాలుడి అపహరణ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు.. బాలుడ్ని సురక్షితంగా ఆ తల్లిదండ్రులకు అప్పగించారు. ఆర్థిక లావాదేవీల వివాదంతో బాలుడ్ని అపహరించినట్లు విచారణలో తెలింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ వెల్లడించారు.
ఆర్థిక లావాదేవీలే కారణం..
శంకర్ రావు.. ఏలూరుకు చెందిన రంగబాబు స్నేహితులు. బాలుడి తండ్రి శంకర్ రావు, ప్రధాన నిందితుడు రంగబాబు మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదాలు తలెత్తాయి. ఈ వివాదం కారణంగా శంకర్ రావు కొడుకును రంగబాబు కిడ్నాప్ చేశాడు. నిందితుడి తల్లి రమణమ్మ, ఈశ్వర అనే ఇద్దరు బాలుడి అపహరణకు సహకరించారు. బాలుడు తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన వెంటనే దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను అరెస్టు చేసి బాలుడ్ని సురక్షితంగా ఆ తల్లిదండ్రులకు అప్పగించామని డీఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి..
PDRP: జనవరి 7, 8 తేదీల్లో పోలవరం డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ భేటీ