పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అధిక ఆశ్వయుజ మాసం తిరుకళ్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ చక్ర - అవభృధోత్సవం నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని, శ్రీ చక్ర పెరుమాళ్లను సింహాసనంపై కొలువు ఉంచారు.
చందనోదకం, సుగంధ ద్రవ్యాలతో
అనంతరం ఆలయ అర్చకులు, పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చందనోదకం, సుగంధ ద్రవ్యాల అభిషేక జలాలతో శ్రీ చక్ర పెరుమాళును అభిషేకించారు. శ్రీ చక్ర పెరుమాళ్లుతో పాటు స్వామి అమ్మవార్లను అలంకరించి హారతులు ఇచ్చి అభిషేక జలాలను భక్తుల శిరస్సులపై చల్లారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వేద పండితులు వేద మంత్రాలు చదువుతూ శాస్త్రోక్తంగా జరిపించారు. రాత్రి పూర్ణాహుతి ధ్వజావరోహణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
ఇవీ చూడండి : అలాంటి వారిని చూసి చప్పట్లు కొట్టాలా...? తెదేపా