ETV Bharat / state

ఘనంగా ద్వారకా తిరుమలేశుని కల్యాణ మహోత్సవాలు - west godavari

ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారి తిరుకల్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

ద్వారకా తిరుమల
author img

By

Published : May 14, 2019, 6:34 PM IST

ద్వారకా తిరుమలేశుని కల్యాణ మహోత్సవాలు ప్రారంభం

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వైశాఖ మాస తిరు కల్యాణ మహోత్సవాలు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెగా తయారు చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయ ముఖమంటపంలో ప్రత్యేక మంటపాన్ని ఏర్పాటు చేసి పచ్చని పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించారు. మంగళవాయిద్యాల నడుమ వేద మంత్రాలు చదువుతుండగా... స్వామి అమ్మవార్లను పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చేశారు. ఈ ఆధ్యాత్మికత ఘట్టాన్ని తిలకించి భక్త కోటి పులకించింది. ఉత్సవాల సందర్భంగా స్వామివారు రోజుకో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. మొదటి రోజు శ్రీవారు.. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమన్నారాయణ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రికి గజవాహనంపై స్వామివారి గ్రామోత్సవం కన్నుల పండుగగా జరగనుంది. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి.

కన్యకా పరమేశ్వరి జన్మదిన వేడుకలు -పల్లకిలో ఊరేగింపు

Intro:చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లి లో ప్రారంభమైన గంగమ్మ జాతరలో విషాదం చోటుచేసుకుంది. గంగమ్మ ఛాయా చిత్రాలను చిత్రీకరిస్తున్న వార్త దిన పత్రిక ఫోటో గ్రాఫర్ అనంత పద్మనాభంకు సమీపంలోని విద్యుత్ తీగలు తగలడంతో ఆయన కింద పడిపోయారు. వెంటనే అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు అనంత పద్మనాభం ను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ...ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతి చెందిన అనంత పద్మనాభం భౌతిక కాయాన్ని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న సందర్శించారు. మృతుడి కుటుంబానికి ప్రఘాడ సానుభూతిని తెలియజేసారు. ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందజేస్తామని కలెక్టర్ తెలిపారు.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.