ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అధిక ఆశ్వయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుండి వచ్చే నెల 3 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో డి.భ్రమరాంబ తెలిపారు. 26వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఈవో ప్రకటించారు. పరిమిత సంఖ్యలో అర్చకులు, సిబ్బందితో ఆలయ ప్రాంగణంలోనే శ్రీవారి కల్యాణ మహోత్సవాలు నిర్వహిస్తామన్నారు. 27వ తేదీన స్వామివారి బ్రహ్మోత్సవాల ధ్వజారోహణ నిర్వహిస్తామన్నారు.
నిత్యసేవలు తాత్కాలికంగా రద్దు
ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవాన్ని 30వ తేదీ రాత్రి ఆలయ ప్రాంగణంలో పరిమిత సిబ్బందితో నిర్వహిస్తున్నట్లు ఈవో చెప్పారు. వచ్చే నెల 3వ తేదీ రాత్రి పుష్పయాగోత్సవంతో అధిక ఆశ్వయుజ మాస కల్యాణ మహోత్సవాలు పరిసమాప్తం అవుతాయని తెలిపారు. ఉత్సవాల సమయంలో... ఆర్జిత సేవలు, నిత్య కల్యాణ క్రతువులను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే నెల 4 నుంచి అన్ని సేవలను పునరుద్ధరిస్తామని ఈవో భ్రమరాంబ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : ఏపీ ప్రభుత్వ పిటిషన్పై సుప్రీం కోర్టులో కేంద్రం కౌంటర్