పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో తెలుగునాడు విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుబోయిన మహేష్ బాబు 1400 కుటుంబాలకు పాలు, గుడ్లు, కూరగాయలు పంపిణీ చేశారు. ఒక్కో ఇంటికి నాలుగు గుడ్లు, అర లీటర్ పాలు, కూరగాయలను అందించారు.
పోలీస్ అధికారిణి ఒకరు రాష్ట్రంలోని పలువురు పోలీసులకు శీతల పానీయాలు సరఫరా చేయడాన్ని ఆదర్శంగా తీసుకొని గ్రామాల్లోని పేదలకు వీటిని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 15 ఏళ్లలోపు పిల్లలు పోషకాహారలోపంతో బాధపడే వారికి సైతం త్వరలో అల్పాహారం అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.