పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తూర్పువీధికి చెందిన రామెళ్ల రామకృష్ణ... కొంతకాలంగా తణుకు పరిసర ప్రాంతాల్లో నిలిపి ఉంచిన లారీల నుంచి డీజిల్‌ను దొంగిలిస్తున్నాడు. ఈ ఘటనపై లారీ యజమానుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిఘా పెట్టి రామకృష్ణను పట్టుకున్నారు.
అతని నుంచి ఓ టాటా సఫారి వాహనం, 17ఖాళీ డీజిల్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. రామకృష్ణకు సహకరించిన విజయవాడకు చెందిన రాజేష్, ఏలూరుకు చెందిన రవితేజపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:
రాగల 3 రోజుల్లో.. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు!