పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం ముందు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బుట్టాయిగూడెం మండలం పద్మవారిగూడెంలో శుక్రవారం నెలకొన్న వివాదంలో తహసీల్దార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ గిరిజనులు డిమాండ్ చేశారు. గిరిజనులపై దాడికి పాల్పడిన రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేసి అక్రమ అరెస్టులు చేసిన గిరిజనులు వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఏజెన్సీలో పనిచేసే అధికారులు గిరిజనేతరులకు కొమ్ముకాస్తున్నారని సీపీఎం నాయకులు ఆరోపించారు. ఏజెన్సీలో సద్దుమణిగిన భూమి వివాదాలను అధికారులు గిరిజనేతరులతో కలిసి రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆరోపణ చేశారు.
ఇది చదవండి రాత్రంతా స్టేషన్లోనే చింతమనేని ప్రభాకర్