పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59కి చేరింది. ఏలూరులో అత్యధికంగా 20కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పెనుగొండలో16, తాడేపల్లిగూడెంలో5, భీమవరం5, పోలవరం3, కొవ్వూరు2, గుండుగొలను2, భీమడోలు1, ఉండి1, నరసాపురం1, టీ. నరసాపురం1, గోపాలపురం1, ఆకివీడు1 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
జిల్లాలో 26మంది డిశ్చార్జ్ అయ్యారు. 33మంది ఏలూరు కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 350మంది క్వారంటైన్ సెంటర్లలో ఉన్నారు. జిల్లాలో 20ప్రాంతాలను రెడ్ జోన్లుగా ఏర్పాటు చేసి.. ప్రజల రాకపోకలు నిషేధించారు. 48మండలాలు ఉండగా.. ఇందులో 27మండలాలు రెడ్ జోన్ల పరిధిలో ఉన్నాయి. మిగతా మండలాలు ఆరెంజ్ జోన్లోకి తీసుకొచ్చారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. పోలీసులు పికెటింగ్ నిర్వహిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది