దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్ధతుగా పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం పోతునూరులో రైతులు కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు. రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ పిలుపుమేరకు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. రైతులకు వ్యతిరేకంగా రూపొందించిన చట్టాలను తక్షణం రద్దు చేయాలని.. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్ అన్నారు. 20 రోజులుగా రైతులు చేస్తున్న పోరాటాన్ని నీరు గార్చేందుకు చర్చల పేరుతో మోదీ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారాన్ని కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయటానికి కేంద్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. రైతులకు అన్ని విధాలా మద్ధతు ప్రకటించాలని ఆయా వర్గాల ప్రజలను కోరారు.
రైతులకు మద్దతుగా కాగడాల ప్రదర్శన - Demonstration of crows in support of farmers breaking news
దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా పోతునూరులో అన్నదాతలు కాగాడాల ప్రదర్శన నిర్వహించారు. 21 రోజులుగా చేస్తున్న పోరాటాన్ని నీరుగార్చేందుకు చర్చల పేరుతో మోదీ ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు.