ETV Bharat / state

Death Toll: జంగారెడ్డిగూడెంలో 18కి చేరిన మరణాలు.. కారణమేంటి ? - జంగారెడ్డి గూడెం వార్తలు

Death Toll Increase: పశ్చిమమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటుసారా మరణాలు 18 కి చేరాయి. జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలు భయపెడుతూనే ఉన్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నాటుసారా బాధితుడు ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై అధికారులు ఇంటింటికీ వెళ్లి విచారణ చేస్తున్నారు.

జంగారెడ్డిగూడెంలో 18కి చేరిన నాటుసారా మరణాలు

author img

By

Published : Mar 12, 2022, 3:22 PM IST

Updated : Mar 13, 2022, 3:53 AM IST

Death Toll in Jangareddygudem:పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలు భయపెడుతూనే ఉన్నాయి. శనివారం మరో ఇద్దరు ఆసుపత్రిలో మరణించడంతో నాలుగు రోజుల వ్యవధిలో మృతుల సంఖ్య 18కి చేరింది. సారా తాగే అలవాటున్న నలుగురు అనారోగ్య కారణాలతో ఉదయం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో చేరారు. వీరిలో ఉప్పలమెట్టకు చెందిన వెంపల అనిల్‌ కుమార్‌ (35), గౌరీశంకరపురానికి చెందిన సునాని ఉపేంద్ర (30) గంటన్నరలోనే కన్నుమూశారు. మృతుడు అనిల్‌ సోదరుడు సర్వేశ్వరరావు, మరొకరు బొల్లా నేతాజీల ఆరోగ్యం నిలకడగా ఉంది.

‘మా ఆయన బైక్‌ మెకానిక్‌గా పని చేస్తారు. రోజూ నాటు సారా తాగుతారు. ఆరోగ్యం పాడవుతుందని చెప్పినా వినేవారు కాదు. ఆయనకు అంతకుముందు ఎలాంటి అనారోగ్యం లేదు. శనివారం పొద్దున్నే వాంతులయ్యాయి. ఆకస్మికంగా పల్స్‌ పడిపోయింది. ఆసుపత్రికి తీసుకొచ్చాక చనిపోయారు. ఆయన మృతికి నాటు సారానే కారణం’ అని అనిల్‌ కుమార్‌ భార్య లావణ్య రోదించారు. ‘నా భర్త మార్బుల్‌ పని చేస్తారు. ఆయనకు నాటుసారా తాగే అలవాటుంది. సోమ, మంగళవారాలు బాగా తాగారు. శుక్రవారం సాయంత్రం నుంచి నీరసంగా ఉందని చెప్పారు. రాత్రి నుంచే వాంతులవుతున్నాయి. శనివారం పొద్దున్నుంచి కళ్లనొప్పులు మొదలయ్యాయి.

.

ఆసుపత్రికి తీసుకొచ్చాక కాసేపటికే చనిపోయారు’ అని ఉపేంద్ర భార్య ప్రియ విలపించారు. కారణాలను విశ్లేషిస్తున్నామని, అందరూ ఒకే అనారోగ్య సమస్యతో చనిపోయినట్లు ధ్రువీకరించలేమని జిల్లా వైద్యాధికారి రవి తెలిపారు. వారంతా సారా తాగడంవల్లే చనిపోయారని చెప్పలేమని వెల్లడించారు. విచారణలో భాగంగా ఖననం చేసిన ఒకరి మృతదేహాన్ని అధికారులు శనివారం వెలికితీశారు. కల్తీ సారా వల్లే తన భర్త చనిపోయారని, స్పష్టతనివ్వాలని మడిచెర్ల అప్పారావు భార్య వెంకటలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు.

తెదేపావి శవ రాజకీయాలు: మంత్రి ఆళ్ల నాని

నాటు సారా కలకలం వెనుక రాజకీయ కారణాలున్నాయని మంత్రి ఆళ్ల నాని వివరించారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో ఆయన బాధితులను పరామర్శించారు. వివిధ అనారోగ్య కారణాలతో మృతి చెందిన వారి కుటుంబీకులకు పరిహారం వస్తుందని తెదేపా నాయకులు ప్రలోభపెట్టి ఇదంతా చేయిస్తున్నారని మంత్రి ఆరోపించారు. రేపోమాపో ఇక్కడికి చంద్రబాబు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు.

‘ఆసుపత్రుల రికార్డుల ప్రకారం జంగారెడ్డిగూడెంలో వారం రోజులుగా మరణించిన వారి సంఖ్య ఐదు. వారిలో ఒకరు గుండెపోటుతో మరణించగా.. మిగిలిన నలుగురు అతిగా మద్యం తాగడంతో చనిపోయారు. వివిధ కారణాలతో ఇళ్లవద్ద చనిపోతున్న వారి మరణాలపై ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా తెదేపావారు శవ రాజకీయాలు చేస్తున్నారు. అప్పారావు అనే వ్యక్తి అంత్యక్రియలు పూర్తయ్యాక ఆయన కుటుంబీకులకు ప్రభుత్వం నుంచి పరిహారం వస్తుందంటూ ఆశ పెట్టి ఫిర్యాదు చేయించారు. సమస్యకు కారణాలు తెలుసుకునేందుకు పోస్టుమార్టం చేయిస్తాం’ అని తెలిపారు.

.

ఒక్కో కుటుంబానికి తెదేపా సాయం రూ.10వేలు

మృతుల కుటుంబాలను తెదేపా నేత గన్ని వీరాంజనేయులు, మాజీ మంత్రి పీతల సుజాత తదితరులు పరామర్శించారు. పార్టీ తరఫున 16 కుటుంబాలకు రూ.10వేల చొప్పున సాయం అందజేశారు. నాటుసారా అరికట్టాలంటూ ఎస్‌ఈబీ స్టేషన్‌ వద్ద ధర్నా చేసి అధికారులకు విన్నపమిచ్చారు.

.

14న జంగారెడ్డిగూడేనికి చంద్రబాబు రాక

తెలుగుదేశం పార్టీ అధినేత, చంద్రబాబు ఈ నెల 14న పశ్చిమ గోదావరి జిల్లాకు రానున్నారు. జంగారెడ్డిగూడెంలో వరుస మరణాల నేపథ్యంలో.. మృతుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని తెదేపా నాయకులు తెలిపారు.

మరణాలపై ప్రభుత్వం నోరు విప్పదా: సోము వీర్రాజు

జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నోరు విప్పడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. వాస్తవాలను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ఎత్తుగడ వేస్తోందని విమర్శించారు.

ముఖ్యమంత్రి ధనదాహమే కారణం: అనిత
మహిళల ఆగ్రహానికి గురికాకముందే.. మద్యం వ్యాపారాన్ని, గంజాయి, నాటుసారా విక్రయాలను ముఖ్యమంత్రి కట్టడిచేస్తే మంచిదని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం ఘటనకు ముఖ్యమంత్రి ధనదాహామే కారణమని ఆమె ఆరోపించారు. వాలంటీర్లు, వైకాపా నేతలే నాటుసారా, గంజాయి విక్రయాలుసాగిస్తుంటే, సీఎం ఎందుకు నిరోధించడంలేదని మండిపడ్డారు. మద్యం అమ్మకాలతో ఆదాయం పెంచుకోవడంపై చూపుతున్న శ్రధ్ధలో సగమైనా ముఖ్యమంత్రి మహిళల మానప్రాణాలపై చూపితే బాగుంటుందని అనిత హితవు పలికారు.

జంగారెడ్డిగూడెంలో 18కి చేరిన నాటుసారా మరణాలు

నాటుసారా జోరు

జంగారెడ్డిగూడెంలో వరుసగా 4 రోజుల్లో 18 మంది మరణించడం, చాలా మంది మృతుల సంబంధీకులు ఈ విషాదానికి నాటుసారానే కారణమని పేర్కొనడం చర్చనీయాంశమైంది. వారి వేదనకు బలం చేకూరేలా పట్టణంలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. జంగారెడ్డిగూడెం మండల పరిధిలో పలుచోట్ల నాటుసారా తయారీ ముమ్మరంగా సాగుతోంది. ఇక్కడినుంచి రవాణా చేసి పట్టణంలోని కొన్ని ఇళ్లు, దుకాణాల్లో రహస్యంగా విక్రయిస్తున్నారు. పట్టణంలోని పాత బస్టాండ్‌, కొత్తపేటలో మూడు ప్రాంతాలు, మార్కెట్‌ ఎదుట, లక్ష్మీనారాయణ థియేటర్‌ వెనుక, గంగిరెడ్డి చెరువు తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఒక్కో ప్యాకెట్‌ రూ.40-50కి అమ్ముతున్నారు. అనుమానం రాకుండా కొన్నిచోట్ల చిన్నపిల్లలతో సరఫరా చేయిస్తున్నారు. జిల్లాలోని జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, కామవరపుకోట, టి.నరసాపురం, చింతలపూడి మండలాల పరిధిలోని కొన్ని గ్రామాల్లోనూ నాటుసారా తయారీ, విక్రయ కేంద్రాలు కుటీర పరిశ్రమగా వెలిశాయి.

Last Updated : Mar 13, 2022, 3:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.