ముఖ్యమంత్రి జగన్ వరద ప్రాంత మండలాల్లో పర్యటించి వరద బాధితులకు తగిన న్యాయం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో మధు పర్యటించారు. ఇటీవల వరదల్లో నిరాశ్రుయులైన కుటుంబాలను మధు పరామర్శించారు.
గోదావరి వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఆర్ధిక సహాయం అందచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూర్తిగా నష్టపోయిన ఇంటికి రూ.50 వేలు, పాక్షికంగా నష్టపోయిన ఇంటికి రూ.20 వేలు తక్షణమే ఆర్ధిక సహాయం అందించాలన్నారు. మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయాలన్నారు. మిగులు భూములు సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. త్వరలో ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం ఇస్తానని మధు తెలిపారు.
ఇదీ చదవండి: ఏపీ: మరో 10, 392 మందికి కరోనా... 4,55,531కు పెరిగిన బాధితులు